దూసుకెళ్తున్న కారు, ఓపెన్‌ డిక్కీలో చిన్నారులు

- July 04, 2017 , by Maagulf
దూసుకెళ్తున్న కారు, ఓపెన్‌ డిక్కీలో చిన్నారులు

ఓ వ్యక్తి తన కారుని వేగంగా పోనిస్తున్నాడు, ఆ కారు డిక్కీ తెరిచే ఉంది. ఆ డిక్కీలో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ఘటనను ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. సాయంత్రం 6 గంటల సమయంలో దియార్‌ అల్‌ ముహర్రాక్‌ రోడ్డులో ఈ ఘటనను తాను చూసినట్లు సంఘటనను తన కెమెరాలో బంధించిన వ్యక్తి తెలిపాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, వాహనదారులు తమ వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండాలనీ, చిన్నారుల జీవితాల్ని ప్రమాదంలో పెట్టడం నేరమని అన్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ కల్చర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఒసామా బహర్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com