సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్యకు విడాకులు మంజూరు

- July 04, 2017 , by Maagulf
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్యకు విడాకులు మంజూరు

సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు చోటు చేసుకొన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య అశ్విన్ ల బంధం కు తెరపడింది. ఈ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. సౌందర్య వ్యాపారవేత్త అశ్విన్ లకు ఏడేళ్ళ క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఏడేళ్ళ కొడుకు ఉన్నాడు.. గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య వివాదాలు ఏర్పడడంతో.. విడిగా ఉంటూ.. విడాకుల కోసం 2016 డిసెంబర్ లో చెన్నై ఫ్యామిలీ కోర్టు గడప ఎక్కారు. న్యాయస్థానం ఈ దంపతులకు ఆరునెలల గడువు ఇచ్చింది.. తాజాగా ఆరునెలల గడువు పూర్తి అవ్వడంతో... తమకు విడిపోవడం ఇష్టమని సొందర్య, అశ్విన్ లు కోర్టుకు వెల్లడించారు. దీంతో ఫ్యామిలీ కోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది.. కాగా కొడుకు వేద్ తల్లి సౌందర్య వద్ద ఉండేటట్లు ఒప్పందం జరిగింది.. కాగా సౌందర్య దర్శకత్వం వహించిన ధనుష్ వీఐపీ 2 త్వరలో రిలీజ్ కానున్నది.. ట్రైలర్ తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొన్న సంగతి విధితమే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com