శరవేగంగా దోహా మెట్రో నిర్మాణం
- July 09, 2017
దోహా మెట్రో మొదటి ఫేజ్ శరవేగంగా నిర్మితమవుతోందనీ, ఇప్పటికే 60 శాతం పైగా పనులు పూర్తయ్యాయని, షెడ్యూల్ ప్రకారమే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా అబ్దుల్ అజీజ్ అల్ సుబైసీద్ చెప్పారు. 280 మిలియన్ మేన్ అవర్స్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యిందన్న అబ్దుల్లా అజీజ్, 10 మెట్రో ప్యాకేజీలు తదుపరి ఫేజ్ డెవలప్మెంట్కి అడ్వాన్స్ అవుతున్నాయని, 37 స్టేషన్లలో మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ఆర్కిటెక్చర్ ఫిట్ ఔట్ జరుగుతోందని తెలిపారు. ఖతార్ రైల్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఈ ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాయి. సకాలంలో ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై డెలివరీ ఎలైన్మెంట్ వర్క్‌షాప్‌ని ఖతార్ రైల్వేస్ కంపెనీ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన అబ్దుల్లా అల్ సుబైయీ, పనుల వేగం పట్ల సంతృప్తితో ఉన్నామన్నారు. 52,000 మందికి మెట్రో తొలి ఫేజ్ కోసం పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







