160,000 నార్కోటిక్‌ పిల్స్‌ గుట్టు రట్టు చేసిన సౌదీ కస్టమ్స్‌

- July 09, 2017 , by Maagulf
160,000 నార్కోటిక్‌ పిల్స్‌ గుట్టు రట్టు చేసిన సౌదీ కస్టమ్స్‌

సౌదీ కస్టమ్స్‌, 160,000 నార్కొటిక్‌ ట్యాబ్లెట్స్‌ని మదినా మరియు యాన్బు ఎయిర్‌ పోర్టులలో వ్యూహాత్మకంగా పట్టుకోవడం జరిగింది. ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ - మదీనాలో కస్టమ్స్‌ అధికారులు, 143,025 నార్కొటిక్‌ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేస్‌లోని క్యాండీ బాక్స్‌లో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ జనరల్‌ డైరెక్టర్‌ ఫైసల్‌ అల్‌ దబాగ్‌ చెప్పారు. ప్రిన్స్‌ అబ్దుల్‌ మొహిసిన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఎయిర్‌పోర్ట్‌ - యాన్బు గవర్నరేట్‌లో కస్టమ్స్‌ అధికారులు 17,023 ట్యాబ్లెట్స్‌ని సూట్‌కేస్‌లో కనుగొని స్వాధీనం చేసుకున్నారు. క్లాత్‌తో చుట్టబడిన ఉడెన్‌ బాక్స్‌లో వీటిని కనుగొన్నట్లు ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ డైరెక్టర్‌ సాద్‌ అల్‌ బక్మి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com