నాచురల్ స్టార్ ను ప్రశంసించిన మంత్రి కేటీర్
- July 10, 2017
నాచురల్ స్టార్ నాని ఇప్పుడు ఓ రేంజ్ ఫాంలో ఉన్నాడని చెప్పాలి. ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్ తో సూపర్ హిట్ అందుకున్న నాని రీసెంట్ గా వచ్చిన నిన్ను కోరి సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నాని సినిమాల గురించి అతని నాచురల్ యాక్టింగ్ గురించి ఈసారి తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.టి.ఆర్ ప్రశంసించడం జరిగింది.
వీకెండ్ లో నాని సినిమాలు చూసిన కె.టి.ఆర్ ఈతరం అద్భుతమైన నటులలో నాని ఒకరు. సినిమాల్లో తనది బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని ప్రశంసలు అందించారు కె.తారక రామారావు. పవర్ ఫుల్ పొలిటిషియన్ గా ఉంటూ సినిమా పరిశ్రమకు సంబందించిన విషయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్న కె.టి.ఆర్ సిని ప్రముఖులతో మంచి స్నేహ సంబంధాలున్నాయి.
ఇక వరుస విజయాలను అందుకుంటున్న నాని నిన్ను కోరితో మరో సూపర్ హిట్ కొట్టాడు. సినిమాలో నాని నటనకు యువ హీరోలే తమ అభినందనలు తెలుపగా ఆ వరుసలో కె.టి.ఆర్ కూడా చేరడం విశేషం. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నివేథా థామస్ హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టి కూడా మంచి రోల్ ప్లే చేశాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







