ఇద్దరు టాప్ షట్లర్స్ ను మట్టికురిపించిన సింధు..!!
- October 17, 2015
తెలుగు తేజం, స్టార్ షట్లర్ పి.వి.సింధు డెన్మార్క్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదు చేసింది. వరల్డ్ చాంపియన్ కరొలినా మారిన్ (స్పెయిన్)పై సెమీఫైనల్లో అద్భుత విజయం సాధించిన సింధు ఈ ఏడాది తొలిసారి సూపర్ సిరీస్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. హోరాహోరిగా సాగిన మూడు సెట్ల మ్యాచ్‌లో వరల్డ్ నం.2 మారిన్‌పై 21-15, 18-21, 21-17తో సింధు విజయఢంకా మోగించింది. వరల్డ్ బ్యాడ్మింటన్‌లో ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు కొరకరాని కొయ్యగా మారిన ఇద్దరు టాప్ షట్లర్స్ ను (క్వార్టర్స్ లో వాంగ్ ఇయాన్) మట్టికరిపించి సింధు సూపర్ సిరీస్ టైటిల్ పోరులో నిలవటం విశేషం. ఫిట్‌నెట్ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న సింధుపై సెమీస్ మ్యాచ్‌లో పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ అద్భుత ఆట తీరుతో తెలుగు షట్లర్ వరల్డ్ చాంపియన్‌ను తెల్లబోయేలా చేసింది. 75 నిమిషాల హోరాహరి మ్యాచ్‌లో సింధు 2-1తో గెలుపొందింది. తొలి సెట్లో 8-3, 11-5తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన సింధు అదే జోరు కొనసాగించింది. 14-16తో మారిన్ పాయింట్ల అంతరాన్ని తగ్గించినా వరుసగా నాల్గు పాయింట్లు సాధించిన సింధు 20-14కు చేరుకుంది. మరో పాయింట్ సాధించగల్గిన మారిన్ 15-21తో తొలి సెట్ కోల్పోయింది. రెండో సెట్లో సింధుకు మారిన్ గట్టి పోటినిచ్చింది. ఆరంభంలో 6-6తో సమవుజ్జీలుగా ఉన్నా..11-6తో మారిన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సింధు సెకండ్ హాఫ్లోనూ మారిన్‌ను నిలువరించలేదు. దీంతో 21-18తో మారిన్ రెండో సెట్ సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్ ఆరంభంలో మారిన్ దూకుడుగా ఆడింది. 5-5, 8-8, 9-9తో నువ్వా నేనా అన్నట్టు సాగినా..11-9తో విరామ సమయానికి మారిన్ ముందంజలో నిలిచింది. సెకండ్ హాఫ్లోనూ 14-16తో సింధు వెను కంజ వేసినా...కీలక తరుణంలో పుంజు కున్న సింధు 16-16తో స్కోరు సమం చేయటమే కాకుండా వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 20-16తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. మ్యాచ్ పాయింట్ అలవోకగా నెగ్గిన సింధు..మూడో సెట్‌తో పాటు ఫైనల్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. చాన్నాళ్ల తర్వాత సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన సింధు ఉద్వేగ భరితంగా సంబరాలు చేసుకుంది. టైటిల్ విజేతను నిర్ణయించనున్న నేటి ఫైనల్స్‌లో చైనా చిన్నది లీ జురేరుతో సింధు తలపడనుంది. లీ జురేరుతో ముఖాముఖి రికార్డులో సింధు 2-2తో సమవుజ్జీగా ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







