తమిళంలో ఏంజెల్ ఆడియో లాంఛ్

- July 13, 2017 , by Maagulf
తమిళంలో ఏంజెల్ ఆడియో లాంఛ్

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై నాగాఅన్వేష్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం 'ఏంజెల్'. సోషియోఫాంటసీ స్టోరీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు రాజమౌళి శిష్యుడు, నూతన దర్శకుడు బాహుబలి పళని. దాదాపు 40 నిమషాలకి పైగా గ్రాఫిక్స్ హంగులతో రెడీ అవుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోకి విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం ఇది వరకే ప్రకటిచింది. ఈ నేపథ్యంలో తాజాగా జూలై 12న 'ఏంజెల్' తమిళ వెర్షన్ 'విన్నైతాండి వందా ఏంజెల్' ఆడియోను రిలీజ్ చేశారు. చెన్నైలో తమిళ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖల సమక్షంలో విన్నైతాండి వందా ఏంజెల్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com