ఇకపై యూ. ఏ. క్యూ. ట్రాఫిక్ జరిమానా లపై 50 శాతం తగ్గింపు

- October 18, 2015 , by Maagulf
ఇకపై యూ. ఏ. క్యూ.  ట్రాఫిక్ జరిమానా లపై 50 శాతం తగ్గింపు

ఉమ్మ్ అల్ క్యూవైన్ లో ట్రాఫిక్ జరిమానా లపై 50 శాతం తగ్గింపు ఇచ్చే మూడు నెలల డిస్కౌంట్ స్కీం ఈ శనివారం నుండి మొదలై డిసెంబర్ 3 వరకు కొనసాగుతుందని  ఇక్కడి పోలీస్ డైరక్టరేట్ జనరల్ యొక్క ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డైరక్టర్ - సయీద్ ఒబైద్ బిన్ అరన్ తెలిపారు. ఈ పధకం- అధిక వేగం మరియు ఇతర ట్రాఫిక్ అతిక్రమణలకు వర్తిస్తుందని, జరిమానా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైన సర్వీస్ సెంటర్‌లోనైనా చెల్లించవచ్చని ఆయన వివరించారు. నూతన విద్యా సంవత్సరం మొదలైన నేపధ్యంలో, ప్రజల భద్రత కోసం  మరిన్ని ట్రాఫిక్ గస్తీని మరింత పెంచామని, విచక్షణా రహితంగా సంచరించే చోదకులకు 2000 దిర్హమ్ లు, 12 బ్ల్యాక్ పాయింట్లు మరియు 30 రోజుల వాహన స్వాధీనం  జరిమానాగా విధించబడుతుందని, డైవింగ్ లైసెన్స్ లేకపోయినా హార్న్ ను  అంతరాయం కలిగించేలా ఉపయోగించినా 100 దిర్హమ్ లు జరిమానా విధించబడతాయని ఆయన హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com