ఏ.ఆర్ రెహమాన్ ప్రదర్శన.. ఫ్యాన్స్ నిరాశ
- July 14, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఏ.ఆర్ రెహమాన్ పాటలంటే ఇష్టపడని వారుండరు. టాలీవుడ్‌నుంచి హాలీవుడ్ దాకా రెహమాన్ సంగీతంలో ఉన్న మాధుర్యం అందరూ రుచిచూశారు. అలాంటి రెహమాన్ తన కచేరీతో అభిమానులను నిరాశపరిచారట.
25 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా గతవారం రెహమాన్ లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో కచేరీ నిర్వహించారు. అయితే కచేరీలో రెహమాన్ ఎక్కువగా తమిళ పాటలే పాడారట. దాంతో ఉత్తరాది భారతీయులు నిరాశచెందారట. అంతేకాదు కొందరు కార్యక్రమం పూర్తవకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయినట్లు చిత్రవర్గాలు సోషల్‌మీడియాలో పేర్కొన్నాయి.
రెహమాన్ నుంచి ఇలాంటి తీరు అస్సలు వూహించలేదంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు కచేరీ కోసం కొన్న టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రెహమాన్‌కి తమిళనాడులోనూ మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఇందులో ఆయన తప్పేమీ లేదని మద్దతిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







