ఆగస్టు 4న బయపెట్టించే ఇదేం దెయ్యం చిత్రం

- July 14, 2017 , by Maagulf
ఆగస్టు 4న బయపెట్టించే  ఇదేం దెయ్యం చిత్రం

నాద్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చ రవి, కిరాక్ అర్పి , రచన స్మిత్ , రుచి ప్రధాన పాత్రలో .. ఎ వి రమణ మూర్తి సమర్పణలో వి రవివర్మ దర్శకత్వంలో చిన్మయానంద ఫిలిమ్స్ పతాకం పై ఎస్. సరిత నిర్మిస్తున్న చిత్రం ''ఇదేం దెయ్యం''. 'ముగ్గురు అమ్మాయిలతో' అనేది ఉపశీర్షిక.  హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని ఆగస్టు 4న విడుదలకు సిద్ధం అయింది  ఈ సందర్బంగా చిత్ర వివరాలను దర్శకుడు వి. రవివర్మ  తెలియచేస్తూ .. ల‌వ్‌ అండ్‌ కామెడీ మిక్స్‌ చేసి హర్రర్‌ కామెడీ చిత్రంగా తెరకెక్కించాం. రాజుగారి గది-2, ప్రేమకథా చిత్రాల‌ను మించేలా మా సినిమాలో కామెడీ ఉంటుంది. ముగ్గురు   ఫ్రెండ్స్‌ ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు. కానీ ఏ ఒక్క అమ్మాయి వీరిని ఇష్టపడదు. ఇలాంటి సమయంలో ఒక ముగ్గురు అందమైన అమ్మాయిలు వీరిని ఇష్టపడతారు .. అయితే వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉండడంతో .. వీళ్ళ గురించి తెలుసుకున్న ముగ్గురు యువకులు వాళ్ళ  బారినుండి ఎలా  తప్పించుకున్నారు అన్నది అసలు కథ.  సినిమా మొత్తం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సింగిల్‌ షెడ్యూల్‌ లో పూర్తీ చేసాం.  అనుకున్న సమయానికి అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేయగలిగామంటే మా టీమ్‌ అందరి పూర్తి సహకారం వల్లే సాధ్యమైంది. నిర్మాత ఎక్కడ కంప్రమైస్ కాలేదు, క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజి పడలేదు,  ప్రస్తుతం హర్రర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాను రూపొందించాం.  హర్రర్ సినిమా అయినా కూడా ఫ్యామిలీ అందరు చూసేలా ఉంటుంది. హీరో శ్రీనాద్, జబర్దస్ట్ కమెడియన్స్ రచ్చ రవి , కిరాక్ అర్పి ల కామెడి గిలిగింతలు పెడుతుంది. ఇందులో ఐదు పాటలు ఉంటాయి. బాలు అందించిన మ్యూజిక్, రి రికార్డింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు.  సెన్సార్ కార్యక్రమాలు జరిపి ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేస్తాం అన్నారు.   
జీవ, అనంత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం : బాలు స్వామి, కెమెరా : కృష్ణ ప్రసాద్, సహా నిర్మాతలు : రత్న శేఖర్, రామ్ కిషోర్, మధుసూదన్ , సౌజన్య , నిర్మాత : ఎస్ సరిత , దర్శకత్వం : వి . రవివర్మ . 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com