18 ఏళ్ళు పనిచేస్తే బ్యాన్: కొట్టి పారేసిన మేన్‌పవర్
- July 14, 2017
కువైట్ మేన్‌పవర్ పబ్లిక్ అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా, 18 ఏళ్ళు పనిచేసినవారి వర్క్ పర్మిట్స్ రెన్యవల్ రద్దు జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అలాంటి ప్రోజల్ ఏదీ తమ దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. కువైట్‌లో 18 ఏళ్ళుగా పనిచేస్తున్నవారికి వర్క్ పర్మిట్ రెన్యువల్ రద్దు చేయాలనే ఆలోచన జరుగుతోందంటూ లోకల్ మీడియాకి చెందిన ఓ పత్రికలో వార్తా కథనం వచ్చింది. అయితే ఈ కథనంలో వాస్తవం లేదని, వివిధ ప్రపోజల్స్‌కి సంబంధించి చర్చలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన సమాచారం అధికారికంగా తామే వెల్లడిస్తామని అహ్మద్ అల్ మౌసా చెప్పారు. ఇలాంటి వదంతుల్ని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







