సమ్మర్‌ ఫెస్టివల్‌ సూపర్‌ హిట్‌

- July 14, 2017 , by Maagulf
సమ్మర్‌ ఫెస్టివల్‌ సూపర్‌ హిట్‌

 బహ్రెయిన్‌ సమ్మర్‌ ఫెస్టివల్‌ 2017 సూపర్‌ హిట్‌ అయ్యిందని నిర్వాహకులు తెలిపారు. జులై 7న ఈ ఫెస్టివల్‌ ప్రారంభమయ్యింది. బహ్రెయిన్‌ అథారిటీ ఫర్‌ కల్చర్‌ అండ్‌ యాంటిక్స్‌ (బిఎసిఎ) ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. రీసైక్లింగ్‌ వర్క్‌షాప్‌, క్విల్లింగ్‌ పేపర్స్‌ వర్క్‌షాప్‌, ఎన్విరాన్‌మెంటల్‌ అవేర్‌నెస్‌ వర్క్‌షాప్‌ వంటివి చిన్న పిల్లల్ని ఈ ఫెస్టివల్‌లో బాగా ఆకట్టుకున్నాయి. బహ్రెయిన్‌ కల్చర్‌నీ, ఎన్విరాన్‌మెంట్‌నీ పిల్లలు అవగాహన చేసుకునేలా ఈ వర్క్‌షాప్‌ని నిర్వహించారు. బౌన్సీ క్యాజిల్‌, ఫుడ్‌ స్టాల్స్‌, బెలూన్‌ వెండర్స్‌ వంటివి ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫుడ్‌, మ్యూజిక్‌ వంటి విభాగాలు ఆహూతుల్ని అలరించాయి. కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్‌ చేయడానికి ఈ ఫెస్టివల్‌ చక్కని వేదిక అని సందర్శకులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com