షాప్‌లో పేలుడు: ఏడుగురికి గాయాలు

- July 14, 2017 , by Maagulf
షాప్‌లో పేలుడు: ఏడుగురికి గాయాలు

మిష్రెఫ్‌లోని ఓ షాప్‌లో పేలుడు సంభవించిన ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. రాత్రి 8.20 నిమిషాల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు కువైట్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ (కెఎఫ్‌ఎస్‌డి) ఓ ప్రకటనలో పేర్కొంది. ఎల్‌పీజీ గ్యాస్‌ లీకేజ్‌ కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడ్డవారిలో ముగ్గురికి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. మిగతా నలుగురికి చిన్నపాటి గాయాలయ్యాయి. పేస్ట్రీ షాప్‌ పాక్షికంగా ఈ ఘటనలో ధ్వంసమయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com