హీరో నాని 'డబుల్' ధమాకా
- July 14, 2017
ఇటీవల విడుదలైన 'నిన్ను కోరి' చిత్రం విజయం సాధించిన ఆనందంలో ఉన్న నాని తన తర్వాత సినిమాల పేర్లను ప్రకటించేశాడు. 'ఎంసీఏ' పేరుతో నాని తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీరాం వేణు దర్శకత్వం వహిస్తుండగా.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమయినట్లు నాని తన ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది.
ఇక తన 21వ చిత్రం పేరును కూడా నాని శుక్రవారం ప్రకటించేశాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'కృష్ణార్జున యుద్ధం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. గతంలో నాని డ్యూయల్ రోల్ పోషించిన 'జెంటిల్మెన్' చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







