మొదలైన 'కాలా' రెండో షెడ్యూల్

- July 16, 2017 , by Maagulf
మొదలైన 'కాలా' రెండో షెడ్యూల్

రంజిత్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'కాలా'. హ్యూమా ఖురేషి కథానాయిక. సముద్రకని కీలకపాత్ర పోషిస్తున్నారు. ముంబయికి చెందిన ఓ తమిళ డాన్‌ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ముంబయిలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. కొన్ని కారణాలతో చిత్రీకరణ ఆపేశారు. ఇప్పుడు చెన్నైలో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇందుకోసం చెన్నై శివారులోని ఈవీపీ పార్కులో ముంబయిలోని తారావి ప్రాంతం సెట్‌ను భారీ బడ్జెట్ తో ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి చిత్రీకరణ ప్రారంభమైంది. కొన్ని రోజుల క్రితమే అమెరికా నుంచి చెన్నై వచ్చిన రజనీకాంత్‌ 'కాలా' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దాదాపు 60 రోజుల పాటు నిరాటంకంగా చిత్రీకరణ ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ షెడ్యూల్‌తో రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తవుతాయని సమాచారం. ఆ తర్వాత కస్తూరిరావ్‌, సముద్రకని, అరుల్‌దాస్‌లకు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కిస్తారు. తర్వాత మళ్లీ ముంబయిలో చిత్రీకరణ ఉంటుందని సమాచారం. చెన్నైలో జరుగుతున్న చిత్రీకరణలో హ్యూమా ఖురేషి, నానాపటేకర్‌, అంజలిలు కూడా పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com