మలేసియాలో 'ఆచారి అమెరికా యాత్ర' షూటింగ్
- July 16, 2017
మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ లో జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆచారి అమెరికా యాత్ర'. దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు, నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. హైద్రాబాద్ లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం ప్రస్తుతం మలేసియాలో తాజా షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'మంచు విష్ణు సరసన కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీలకపాత్ర పోషిస్తున్నారు. విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ హిలేరియస్ గా నవ్విస్తుంది. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి ఆద్యంతం అలరించేలా ఓ మంచి కథను సమకూర్చారు. ప్రస్తుతం మలేసియా షెడ్యూల్లో భారీ క్యాస్టింగ్ తో నాగేశ్వర్‌రెడ్డి ఎంటర్ టైనింగ్ సీన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అనంతరం టీం మొత్తం అమెరికా వెళ్లనున్నాం. అక్కడ మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం' అన్నారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









