కోటి రూపాయలు నష్టం తెచ్చిపెట్టిన సెల్ఫీ

- July 16, 2017 , by Maagulf
కోటి రూపాయలు నష్టం తెచ్చిపెట్టిన సెల్ఫీ

యువతకు సెల్ఫీ ఓ క్రేజ్‌. ఎక్కడంటే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ కొన్నిసార్లు తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కానీ ఈ సెల్ఫీ మాత్రం దాదాపు 2లక్షల డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కొక్కటి 20వేల డాలర్ల ఖరీదు చేసే వస్తువులు ఆమె సెల్ఫీ కారణంగా ముక్కలు ముక్కలై పోయాయి.

అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ది 14 ఫ్యాక్టర్టీ ఆధ్వర్యంలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనలో హాంకాంగ్‌కు చెందిన కళాకారుడు సిమన్‌ బిర్చ్‌ వినూత్నమైన డిజైన్లలతో తయారుచేసిన కిరీటాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శన వీక్షించేందుకు వచ్చిన ఓ యువతి వాటి ముందు నిలబడి సెల్ఫీలు తీసుకోవాలని సంబరపడింది. సెల్ఫీ తీసుకుంటుండగా ఆమె జారి కిరీటాలు నిలబెడ్డిన స్టాండ్స్‌కు తగిలింది. ఇంకేముంది అవన్నీ ఒకదాని వెంట మరొకటి పడిపోయి పగిలిపోయాయి. వాటి ఖరీదు దాదాపు 2లక్షల డాలర్లు ఉంటుందట. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.28కోట్లు. ఆ కిరీటం ఒక్కోదాని తయారీకి 20 నుంచి 30 గంటలు పట్టిందట. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అంత ఖరీదైన వస్తువులు పగిలిపోయినా కూడా వాటిని తయారుచేసిన కళాకారుడు ఆమెను ఏమీ అనలేదు. ఇది కావాలని చేసిన పని కాదు.. ఆ యువతి పట్టుతప్పిపోయి పడటం వల్ల అవి పగిలిపోయాయి అని అన్నారు. ఆమె దగ్గర నుంచి ఎటువంటి నష్టపరిహారం కూడా తీసుకోలేదని తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com