దాసరి నారాయణరావు కి రాజ్యసభ ఘన నివాళి

- July 17, 2017 , by Maagulf
దాసరి నారాయణరావు కి రాజ్యసభ ఘన నివాళి

ఈ మధ్యన చనిపోయిన రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి దాసరి నారాయణరావు కి పార్లమెంటు ఘన నివాళి అర్పించింది. ఇవాళ మొదలైన సభ కాసేపు దాసరి గురించి మాట్లాడుకుంది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సంతాప సందేశాన్ని వినిపించారు. పలు రంగాల్లో ఆయన చేసిన కృషిని కొనియాడారు.
సినిమా, పత్రికా రంగంలో ఎంతో మందికి ఉపాధిని చూపించారని, ఎన్నో పార్లమెంటరీ సంఘాల్లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకుందని అన్సారీ గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న టైం లో కూడా అనేకమందికి ఆయన సహాయం చేసారు అని గుర్తు చేసుకున్నారు అందరూ.
ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టైం లో సొంత ప్రాంతాలకే కాక ఏపీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అని చెప్పుకొచ్చారు మరికొందరు. రెండు నిమషాలు సభ మౌనం పాటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com