త్వరలో వాట్సాప్‌నకు పోటీగా కొత్త యాప్!
- July 17, 2017
మెసేజింగ్ సర్వీస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది వాట్సాప్. వియ్ చాట్, హైక్ వంటి ఎన్ని మెసెంజర్లు వచ్చినా వినియోగదారులు ఎక్కువమంది వాట్సాప్వైపే మొగ్గుచూపారు. ఇప్పుడు వాట్సాప్‌నకు పోటీగా మరో కొత్త యాప్ రాబోతోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ కొత్త యాప్‌ను తీసుకురాబోతోంది. 'ఎనీటైమ్' పేరిట దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.అంతకుముందు వ్యాపార వినియోగదారుల కోసం ఇదే సంస్థ గతంలో 'చైమ్' అనే యాప్‌ను రూపొందించగా.. తాజాగా అందరి వినియోగదారుల కోసం కొత్త యాప్‌ను తీసుకురాబోతోంది.
వాట్సాప్ తరహాలో ఈ యాప్‌లో చాట్ చేసుకోవడంతో పాటు, ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం ఉండబోతోంది. అంతేకాదు ముఖ్యమైన మెసేజ్‌లను ఎన్‌క్రిప్ట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అటు మొబైల్‌తో పాటు, డెస్క్‌టాప్‌లోనూ పనిచేసే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. వాట్సాప్ మాదిరిగా వీడియోలను, ఇమోజీలు, స్టిక్కర్లు, జిఫ్ ఇమేజ్‌లను సైతం పంపుకోవచ్చు. ఫోన్ నంబరుతో సంబంధం లేకుండా పేర్లు ద్వారా స్నేహితులు అనుసంధానం అవ్వొచ్చు.త్వరలో దీన్ని వినియోగదారులకు తీసుకొచ్చేందుకు అమెజాన్ సన్నద్ధమవుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







