ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న `నాకు నేనే తోపు తురుమ్
- July 19, 2017
ధృవ క్రియేషన్స్ పతాకంపై అశోక్ కుమార్, మానస జంటగా నటిస్తున్న చిత్రం 'నాకు నేనే తోపు తురు '. దర్శకుడు జి. శివమణి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేటి రాజకీయాల నేపథ్యంతో...పూర్తి వినోదాత్మక ప్రేమ కథగా ఈ సినిమా రూపొందించారు. యాక్షన్, రొమాన్స్ లాంటి కమర్షియల్ అంశాలు కథలో ఇమిడి ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాకు నేనే తోపు తురుము విడుదలకు సిద్దమయ్యింది. వివరాలు నిర్మాత ధృవ కుమార్ తెలుపుతూ....''మనం పూజించే దేవుళ్లు ఎందరున్నా అన్నం పెట్టే రైతు, దేశాన్ని రక్షించే సైనికులే కనిపించే దేవుళ్లు అనేది కథలో ప్రధానాంశం. ప్రజలు మారితేనే రాజకీయ పరిస్థితులు మారతాయి అనే సందేశాన్ని చిత్రంలో చెబుతున్నాం. పేదరికంలో పుట్టిన ఓ యువకుడు చిరు వ్యాపారిగా జీవితాన్ని మొదలుపెడతాడు. అతను రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ముఖ్యమంత్రిగా ఎదిగి తర్వాత ప్రధాని స్థాయికి చేరుతాడు. ప్రధాని హోదాలో అతను తీసుకున్న సంచలన నిర్ణయాలు సమాజంలో, ప్రజా జీవితంలో అత్యున్నత మార్పులు తీసుకొస్తాయి. ఈ యువ ప్రధాని తీసుకున్న వినూత్న చర్యలు ఏంటన్నది సినిమాలో చూడాలి. రాజకీయ అంశాలను, కథలోని సందేశాన్ని ఎక్కడా విసుగు లేకుండా వినోదాత్మకంగా చూపిస్తున్నాం. గోవా, హైదరాబాద్, విశాఖపట్నం లోని వివిధ అందమైన లొకేషన్లలో చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 28న నాకు నేనే తోపు తురుము చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.'' అన్నారు
సుమన్ శెట్టి, చలపతిరావు, సూర్య , జబర్దస్త్ అప్పారావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రేమ్ ఎల్ఎం, ఎడిటర్ నందమూరి హరి, సినిమాటోగ్రఫీ విజయ్ దగ్గుబాటి, నిర్మాత ధృవ కుమార్, దర్శకత్వం జి.శివమణి.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









