కేరళ లో దారుణం మతం మార్చుకోపోతే నరికేస్తామంటూ బెదిరింపులు
- July 22, 2017
మతం మార్చుకోకపోతే కాలు, చెయ్యి నరికేస్తామంటూ మలయాళీ రచయిత కేపీ రమనున్నీకి బెదిరింపు లేఖ వచ్చింది. మొదట తాను ఈ లేఖను పట్టించుకోలేదని అయితే సీనియర్ రచయితలు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులకు కంప్లైంట్ చెయ్యమని సలహా ఇవ్వడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2010లో కూడా ఇలాగే న్యూమన్ కాలేజీ ఫ్రొఫెసర్ జోసఫ్‌ని కూడా ప్రశ్నాపత్రంలో మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు రాశారంటూ కాలు, చెయ్యి నరికేశారు. ఇప్పుడు రమనున్నీకి రాసిన లేఖలో జోసఫ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయనకు పట్టిన గతే మీకు కూడా పడుతుందని బెదిరిపు లేఖలు రాశారు. రమనున్నీ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కేరళకు చెందిన యువకులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌తో సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇలాంటి లేఖలు రావడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







