అరుణ్ విజయ్ గాయపడ్డారు

- October 20, 2015 , by Maagulf
అరుణ్ విజయ్ గాయపడ్డారు

 రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'బ్రూస్ లీ' విలన్ అరుణ్ విజయ్ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయన తాజాగా చక్రవ్యూహ అనే టైటిల్ తో ఓ కన్నడ చిత్రం చేస్తున్నారు. షూటింగ్ లో భాగంగా జరిగిన సీన్ లో ఆయన అనుకోని విధంగా పడి గాయపడ్డారు. ముఖానికి బాగా దెబ్బలు తగిలాయి. ఈ విషయమై ఆయన సోషల్ నెట్ వర్కింగ్ మీడియా ద్వారా అభి మానులకు తెలియచేసారు. మెడికల్ రిపోర్ట్ సైతం ఆయన జత చేసారు. మీరు ఇక్కడ చూడండి. నటుడు విజయ్ కుమార్-మంజుల తనయుడు అరుణ్ విజయ్. ఆ మధ్య వచ్చిన అజిత్ చిత్రం 'ఎన్నై అరిందాల్‌'(ఎంత వారుగానీ) చిత్రంలో విలన్ గా నటించిన అరుణ్‌ విజయ్‌ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రం చేసారు. ఆయన నిజ జీవితంలో నిర్మాత గా టర్న్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 'ఇన్‌ సినిమాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' పేరిట ఆయన చిత్రాలు తీయనున్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ సంస్థను ప్రారంభించారు. కొత్త కళాకారులను పరిచయం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిభావంతులైనా నిరూపించుకోవడానికి అవకాశాల్లేని యువకులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గౌతం మేనన్‌ దర్శకత్వంలో అజిత్‌ నటించిన'ఎన్నై అరిందాల్‌'లో ప్రతినాయకుడి పాత్ర ద్వారా కోలీవుడ్‌లో అరుణ్‌ విజయ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఆయన నటించిన 'వా' త్వరలో విడుదల కానుంది. త్వరలో గౌతం మేనన్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం శింబుతో 'అచ్చం ఎన్బదు మడమైయడా' అనే సినిమాను గౌతం మేనన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయ్యాక అరుణ్‌ విజయ్‌ కొత్త చిత్రం ప్రారంభంకానుంది. అరుణ్‌విజయ్‌ మాట్లాడుతూ.... ఏ పాత్రలో నటించినా... ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో నటించడానికి ఇష్టపడతా. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి హీరోగా మాత్రమే నటించాల్సిన అవసరం లేదు. అలాగే..అరుణ్ విజయ్.. ఒకప్పటి కమల్ హాసన్ మూవీ "సత్య"పై మనసు పడ్డాడు... ఈ సినిమాను రీమేక్ చేయాలని ఉందని ఇటీవల తన మనసులోని మాటను బయటపెట్టాడు.... నిరుద్యోగుల పడే ఇబ్బందులు.. సమాజంలో వారికి ఎదురైన సమస్యల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుందంటున్నాడు అరుణ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com