జి. సి. సి. సమావేశానికి హాజరైన బహ్రైన్

- October 20, 2015 , by Maagulf
జి. సి. సి. సమావేశానికి హాజరైన బహ్రైన్

 

గల్ఫ్  కోపరేషన్ కౌన్సిల్ (జి. సి. సి.) దేశాల సాంఘీకాభివృద్ధి శాఖా మంత్రుల 32 వ సమావేశం నిన్న రాత్రి కతార్ లోని దోహాలో జరిగింది.  బహ్రైన్ శ్రామిక మరియు సాంఘీకాభివృద్ధి శాఖా  మంత్రి జమీల్ బిన్ మొహమ్మద్ దేశం తరపున ఆ సమావేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మాట్లాడుతూ, సభ్య దేశాలమధ్య పరస్పర సహకారం, సామాజిక కార్యక్రమాల్లో సఫలమైన విధానాల మార్పిడి వంటి అంశాల ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. ఉమ్మడి అరేబియన్ గల్ఫ్ పనులలో పాలుపంచుకున్న బహ్రైన్ కృషిని, అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి అమలు చేయవలసిన వ్యూహాత్మక విధానాల పట్ల నిబద్ధత చూపవలసి అవసరాన్ని  ఆయన చాటిచెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com