పాలస్తీనాలో మళ్లీ కాల్పులు, ఆరుగురు మృతి
- July 22, 2017
పాలస్తీనాలో ఇజ్రాయిల్ సైనికుల ఆగడాలకు అమాయక పౌరులు బలైపోతు న్నారు. గతరెండు రోజులుగా వెస్ట్‌బ్యాంక్‌లో చోటుచేసుకుంటున్న హింసాయుత ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. జెరూసలేం పాతనగరంలోని ప్రఖ్యాత ముస్లిం ప్రార్థనా మందిరం టెం పుల్ మౌంట్ వద్ద ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున భద్రతా బలగాల్ని మోహరించింది. మెటల్ డిటెక్టర్లను ఏర్పాటుచేసి, జెరూసలేం గోడకు సమీపంలో ఇనుపకంచె వేసింది. ప్రార్థనా మందిరం వైపు పాలస్తీనా పౌరులెవర్నీ వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో భద్రతాబలగాలకు, పాలస్తీనా పౌరుల మధ్య తీవ్రఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మరికొద్ది గంటల్లోనే వారిపై భద్రతా బలగా లు కాల్పులు జరిపారు. టెంపుల్‌మౌంట్ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆక్రమిత ప్రాంతంలో మెటల్ డిటెక్టర్లతో ప్రవేశ ద్వారాలను ఏర్పాటుచేయటంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌తో ఉన్న సంబంధాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నామని ఆయన ప్రక టించారు. ప్రఖ్యాత మసీదు 'అల్ అక్సా' నుంచి ఇజ్రాయిల్ బలగాలు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







