జీవితంలో చీకటి కోణాలను బయటపెట్టిన షకీలా

- July 23, 2017 , by Maagulf
జీవితంలో చీకటి కోణాలను బయటపెట్టిన షకీలా

మలయాళి నటి షకీలా తన జీవితం గురించి సమయం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటుంది. తన జీవితం మీద ఆమె ఓ పుస్తకాన్ని రాయడానికి కూడా సిద్ధపడింది. సినిమాల ద్వారా తానుసంపాదించిన డబ్బంతా తనకుటుంబసభ్యులు కాజేస్తే, మరికొందరు తనను దారుణంగా కొట్టి హింసించారని చెబుతోంది. తనుజీవితంలో మొత్తం 20 మందినిప్రేమించాననీ, వేరు వేరు కారణాలతో వారంతా తనకు దూరం అయ్యారని అంటోంది. వారిలో చాలా మంది తన మీద తరచూ చేయి చేసుకునేవారనీ, ఆఖరికి షూటింగ్‌లో తన సహనటి సిల్క్‌ స్మిత కూడా తన మీద చేయి చేసుకుందని వివరించింది. ఓ సినిమాలో తాము ఇద్దరం కలిసి నటించేసన్నివేశంలో స్మిత తను కొట్టవలసిన సీను ఉందనీ, ఆసమయంలో స్మిత తననునెమ్మదిగా కొట్టినట్టు నటిస్తుందని అనుకుంటే, గట్టిగా కొట్టిందని అంటోంది. ఆ తరువాత తనకు ఓ చాక్లెట్‌ బాక్స్ ఇచ్చి కూల్‌ చేసిందట! అయితే షకీలాకు సినిమాలు లేక, తనని ఎవరూ పట్టించుకోవడం లేదన్న డిప్రెషన్‌తో ఇలా మాట్లాడుతోందని మాలీవుడ్‌ జనాలు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com