దూసుకొచ్చిన ఇరాన్‌ యుద్ధనౌక.. కాల్పులు

- July 26, 2017 , by Maagulf
దూసుకొచ్చిన ఇరాన్‌ యుద్ధనౌక.. కాల్పులు

పర్షియన్‌ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిన ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా కాల్పులు జరిపింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పర్షియన్‌ గల్ఫ్‌ వైపు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ యుద్ధనౌకను పలుమార్లు ఆగాలని అమెరికాకు చెందిన థండర్‌బోల్ట్‌ బోటు పలుమార్లు హెచ్చరించింది.
             ఇరాన్‌ నౌక హెచ్చరికలను ఖతరు చేయకపోవడంతో దాన్ని వెంబడించింది. దాదాపు 150 యార్డుల చేరువలో ఇరు ఓడలు సముద్రంలో వెళ్లినట్లు అమెరికా నేవీ వర్గాలు తెలిపాయి. అంత దగ్గరలో ప్రయాణించడం కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించాయి. అప్పటికీ ఇరాన్‌ నౌక వెనక్క తగ్గకపోవడంతో వరుసగా కాల్పులు జరిపినట్లు వివరించాయి.
      అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేరు తెలపడానికి ఇష్టపడని పెంటగాన్‌ అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు చెందిన నౌకలు డే టైమ్‌లో విన్యాసాలు నిర్వహిస్తుండగా.. ఇరాన్‌ నౌక ఈ చర్యకు దిగినట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com