నవరసాలు పలికించే ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ
- July 26, 2017
వెండితెరపై నవరసాలను పలికించగల ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ అని మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. యువకళావాహిని ఆధ్వర్యంలో సినీ నటులు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కైకాల సత్యనారాయణ దంపతులకు బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో సహస్రపూర్ణ చంద్రదర్శన సన్మానం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్య మాట్లాడుతూ ఎలాంటి పాత్రలోనైనా జీవించగల సమర్థులు కైకాల అని అన్నారు. విశిష్ట అతిథి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కళాకారులను ప్రభుత్వాలు గుర్తించకపోయినా ప్రజలు వారికి తగిన ప్రాధాన్యమిచ్చి సన్మానించాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. కళాకారులు లక్షల మందికి ఆనందాన్ని పంచుతారన్నారు. అప్పట్లో నటుడే కీలకంగా వ్యవహరించే వాడని.. ఇప్పుడు గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు. కైకాల సత్యనారాయణ లాంటి నటులను సత్కరించుకోవడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు.
సీనియర్ నటి జమున మాట్లాడుతూ కైకాల అప్పటి తరంలో ఎన్‌టిఆర్‌తో ధీటుగా నటించగలిగారని గుర్తు చేశారు. నటనలో ఆయనకు ఆయనే సాటి అని తెలిపారు. సీనియర్ దర్శకులు రేలంగి నర్సింహారావు మాట్లాడుతూ నటుడిగానే కాకుండా దర్శక నిర్మాతల హితం కోరే వ్యక్తిత్వం కేవలం కైకాలకే సొంతమన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సారిపల్లి కొండలరావు వ్యవహరించగా సీనియర్ నటులు గీతాంజలి, కవిత, గజల్ శ్రీనివాస్, సీనియర్ దర్శకులు కోదండరాంరెడ్డి, గాయని శారద ఆకునూరి, సామాజిక వేత్త కొత్త కృష్ణవేణి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







