తెలుగు రాష్ట్రాల మీదుగా అయోధ్యకు కొత్త రైలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర

- July 26, 2017 , by Maagulf
తెలుగు రాష్ట్రాల మీదుగా అయోధ్యకు కొత్త రైలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర

రామేశ్వరం- ఫైజాబాద్‌ వారపు రైలు నేడు ప్రారంభంహైదరాబాద్‌: తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. రామేశ్వరం- ఫైజాబాద్‌ (వయా అయోధ్య) వారపు రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 27న వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, తెలంగాణలోని వరంగల్‌ స్టేషన్లలో ఆగే ఈ రైలు (నెం.16793/16794) ఆగస్టు 2 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. ఈ రైలు రామేశ్వరంలో ప్రతి ఆదివారం రాత్రి 11.50కి; ఫైజాబాద్‌లో ప్రతి బుధవారం రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com