మరోసారి జనం మధ్యలోకి జనసేన అధినేత
- July 26, 2017
జనసేన నేత పవన్ కళ్యాణ్ మరోసారి జనాల మధ్యలోకి రాబోతున్నాడు. జులై 29 న ఉద్దానంలోని కిడ్నీ బాధితులతో పవన్ మాట్లాడి , అక్కడ పర్యటించబోతున్నట్లు సమాచారం. మరుసటి రోజు జులై 30న వైజాగ్ హార్వర్డ్ వైద్యులతో పవన్ సమావేశమై చర్చిస్తారు. అనంతరం పవన్, వైద్యులు ముఖ్యమంత్రితో భేటీ అయి ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడబోతున్నారని సమాచారం.
పవన్ కల్యాణ్ ఇప్పటికే హార్వర్డ్ మెడికల్ స్కూల్కి చెందిన వైద్యులతో ఈ అంశంపై చర్చించారు. ఆయన కొద్ది నెలల కిందట హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించేందుకు వెళ్లారు. ఆ సందర్బంగా అక్కడి మెడికల్ స్కూల్ వైద్యులతో మాట్లాడుతూ.. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పెరగడం, వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







