నాలుగు సౌదీ నగరాల్లో తుఫాను వచ్చే అవకాశం
- July 27, 2017
జెడ్డా: ధూళితో నిండిన గాలులు మరియు రాజ్యంలోని కొన్ని ప్రాంతాల్లో తగ్గిన దృశ్యమానత ప్రభావం ఏర్పడనుందని బుధవారం మెట్రోలజి అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ జనరల్ అథారిటీ వాతావరణ సూచనలో పేర్కొంది. వాతావరణ అధికారుల అంచనా ప్రకారం అంచనా ప్రకారం రియాద్ మరియు నజ్రాన్ తూర్పు ప్రాంతాలతోపాటు, ఎర్ర సముద్రం యొక్క దక్షిణ తీరాలలో ఆ ప్రభావం ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మబ్బులతో దట్టంగా అలుముకొని ఉంటుంది మరియు మందమైన వాతావరణం జజాన్, అసిర్, బహ మరియు తైఫ్ ప్రాంతాలలో తుఫాను సంభవించే అవకాశం ఉంటుంది. మదీనా మరియు తబూక్ పర్వత ప్రాంతాలలో చురుకైన గాలులు చుట్టు ముట్టబడి పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వాతావరణం ఏర్పడనుంది. అయినప్పటికీ, రాజ్యం యొక్క చాలా భాగాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి అలాగే తూర్పు ప్రాంతంలో చాలా వేడిగా ఉంటుంది. ఎర్ర సముద్రంపై గాలి కదలికలు గంటకు 18 నుంచి 42 కిలోమీటర్ల వేగంతో, పశ్చిమ దిశగా వేయవచ్చని వాతావరణ నివేదిక పేర్కొంది. సముద్రపు కెరటాల ఉదృతి ఎత్తు సగటు పరిస్థితులతో 1 లేక 2 మీటర్ల ఎత్తు నుంచి 25 మీటర్ల వరకు ఉంటుంది. అరేబియా గల్ఫ్‌లో, గాలులు ఉత్తర దిశగా ఉత్తర దిశగా 18 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. సముద్రపు అలల ఎత్తు సగటు సముద్రపు సాధారణ పరిస్థులలో 1-2 మీటర్ల మధ్య ఉంటుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







