మోహన్‌బాబు కథానాయకుడిగా 'గాయత్రి' ప్రారంభం

- July 29, 2017 , by Maagulf
మోహన్‌బాబు కథానాయకుడిగా 'గాయత్రి' ప్రారంభం

మో హన్‌బాబు కథానాయకుడిగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘గాయత్రి’. మదన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి మోహన్‌బాబు మనవరాళ్లు అరియానా, వివియానా క్లాప్‌నిచ్చారు. వాళ్లతో కలిసి లక్ష్మి మంచు, వెరోనికా మంచు, నిర్మల మంచు, పరుచూరి గోపాలకృష్ణ, డైమండ్‌ రత్నబాబు, సుద్దాల అశోక్‌తేజ దర్శకుడికి స్క్రిప్ట్‌ని అందజేశారు. మంచు లక్ష్మి తనయ విద్యానిర్వాణ మంచు కెమెరా స్విచ్ఛాన్‌ చేసింది. దర్శకుడు మదన్‌ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మోహన్‌బాబు కాస్త విరామం తర్వాత కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.
ఒక విభిన్నమైన కథతో తెరకెక్కబోతోంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తామ’’ని తెలిపింది చిత్రబృందం. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, కళ: చిన్నా, కూర్పు: శేఖర్‌, సంగీతం: తమన్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com