కువైట్ లోతల్లిదండ్రులకు, తోబుట్టువులకకు వీసాలు నిలిపివేత

- July 29, 2017 , by Maagulf
కువైట్ లోతల్లిదండ్రులకు, తోబుట్టువులకకు వీసాలు నిలిపివేత

తమ దేశంలో పనిచేస్తున్న నిర్వాసితులు .వారి  తల్లిదండ్రులను, భార్యాపిల్లలను తీసుకుని వచ్చేందుకు వీసాలను  తాత్కాలిక నిలుపుదల చేసింది. ఇప్పటిదాకా కుటుంబ సభ్యులను కుటుంబ వీసాపై అనుమతించిన ప్రభుత్వం ఈ నిర్ణయం  ప్రస్తుతానికి కొంత కాలం పాటు వాయిదా వేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు చెల్లిస్తామని ప్రవాసులు అంగీకరించినా  ఎట్టి పరిస్థితిలోను కుదరదంటోంది. చమురేతర ఆదాయాన్ని పెంచుకునేందుకు కువైట్ ప్రభుత్వం వినూత్న చట్టాలను, విధానాలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా.. విదేశీయుల హెల్త్ ఇన్సూరెన్స్‌ ఫీజును పెంచేందుకు ఏర్పాట్లను చేస్తోంది. పెంచిన ఫీజులు అమల్లోకి వచ్చేంతవరకూ తాత్కాలికంగా ప్యామిలీ వీసాల ప్రక్రియకు బ్రేకులు వేసింది.  జాతీయ అసెంబ్లీకి పంపిన కొత్త ఫీజు జాబితాను ఆమోదించడానికి వరకు నిర్వాసితులు వారి తల్లిదండ్రులు లేదా తోబుట్టువులను కుటుంబ నివాస వీసాలపై తీసుకురాలేరని భద్రతా వర్గాలు తెలిపాయి. కొత్త రుసుములు విపరీతంగా పెరుగుతున్నాయని వారు తెలిపారు. దేశంలో ఇప్పటికే ఉన్న తమ తల్లిదండ్రులు, తోబుట్టువులపై ఆరోగ్య భీమా పెంపును ప్రారంభించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీంతో వారి నివాసం అనుమతిని పునరుద్ధరించినప్పుడు 1,500 మంది ఈ నెలలో తమ నివాసాలను పునరుద్ధరించారు.మరో  13,000 మంది అలా చేయాల్సి ఉంది. ఈ నిర్ణయం కువైట్ల బంధువులు, ప్రత్యేక అవసరాలకు మినహా మినహాయింపులు లేవు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com