పాక్‌లో ఘోర ప్రమాదం, 16 మంది సజీవ దహనం
- July 30, 2017
పాకిస్థాన్‌లో ఆదివారం మళ్లీ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రావల్‌పిండి నుంచి పెషావర్ వైపు వెళుతున్న వ్యాను గ్యాస్ పైప్‌లైన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాను పూర్తిగా దగ్ధమై అందులోని 16 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొని వ్యాను పక్కనే ఉన్న గ్యాస్ పైప్‌లైను వైపునకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకంది. సమాచారం అందుకొన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు అదుపుచేశారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తుపట్టలేకపోతున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తామని తెలిపారు. ఇటీవల ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడడంతో కొన్ని వేల టన్నుల ఆయిల్ లీకైంది. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆయిల్ పట్టుకోవడానికి ట్యాంకర్ చుట్టూ గుమిగూడారు. అదే సమయంలో ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించడంతో ట్యాంకర్ పేలిపోయింది. ఈఘటనలో 153 మంది సజీవదహనమయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!









