హీరో అక్షయ్.. నటి ట్వింకిల్.. ఓ 'టాయ్‌లెట్'
- July 31, 2017
అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథా’. ప్రధాని మోదీ తలపెట్టిన స్వచ్ఛభారత్ నేపథ్యంలో ఈ చిత్రం రాబోతోంది. ఓ వ్యక్తి తన భార్య కోసం టాయ్‌లెట్ కట్టించడానికి ఎలాంటి పాట్లు పడాల్సి వచ్చింది అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనారాయణ్ సింగ్ తెరకెక్కించారు.
ఈ సందర్భంగా అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా ఓ ఆసక్తికర విషయాన్నిసోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘మాకు పెళ్లైన కొత్తలో మా వారికి ఒక్కటే చెప్పా. డార్లింగ్.. నా హృదయాన్ని, జీవితాన్ని, ఆఖరికి నేను తినే తిండి నీతో షేర్ చేసుకుంటా. కానీ నా టాయ్‌లెట్‌ని మాత్రం షేర్ చేసుకోలేను అని చెప్పా.’ అని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అనంతరం ఈ మెసేజ్‌ను అక్షయ్ తన ట్విటర్‌లో షేర్ చేశారు.
‘టాయ్‌లెట్-ఏక్ ప్రేమ్ కథా’ చిత్రానికి అక్షయ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో అక్షయ్‌కి జోడీగా భూమి పెడ్నేకర్ నటించింది. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







