అధ్యక్షుడు నికోలస్ వ్యతిరేకంగా వెనిజులాలో తీవ్ర ఆందోళనలు
- July 31, 2017
ఎన్నికల వేళ అధ్యక్షుడు నికోలస్ మదురోకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రతిపక్షాల నియంత్రణలో ఉన్న కాంగ్రెస్ను రద్దు చేసేందుకు రాజ్యాంగ సవరణకు పూనుకున్న మదురో .. దేశీయంగా, అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తాజాగా పార్లమెంటు ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలకు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన ఆందోళనల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి, ప్రతిపక్షానికి చెందిన యువజన నాయకుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బలగాలు కారకాసులో కాల్పులు జరిపాయి. ఫలితంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శనివారం జరిగిన నిరసనల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. అధ్యక్షుడికి వ్యతిరేకంగా నాలుగు నెలల నుంచి జరుగుతున్న ఆందోళనల్లో దాదాపు 110 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







