పోలీసు అధికారిగా ఉండాలనే బాలుని కోర్కెను అంగీకరించిన దుబాయ్ పోలీస్
- July 31, 2017
"కలలు కనండి ..వాటిని కష్టించి సాకారం చేసుకోండని " దివంగత మన దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బావి భారత పౌరులకు ఓ మంచి సందేశం అప్పట్లో ఇచ్చారు. అందాకా ఆగలేని ఓ దుబాయ్ బుడతడు తన తండ్రీని సతాయించడం మొదలుపెట్టాడు. దానితో ఆ తండ్రి దుబాయ్ పోలీసుల అధికారి కావాలని కోరిక తన కుమారుడికి ఉందని...అందుకోసం తనను నిత్యం సతాయిస్తున్నాడని తన ఎనిమిదేళ్ల కుమారుడి కోరికను తీర్చండి మహాప్రభో అంటూ దుబాయ్ పోలీసులకు ట్వీట్ చేశాడు. అందుకు స్పందించిన దుబాయ్ పోలీస్ పోలీసు యూనిఫారం తీసుకొని ఆ బాలుని పోలీసు కేంద్రానికి రావాలని సాదరంగా ఆహ్వానం పలికి ఆ బాలుడి పర్యటనను ఆస్వాదించడానికి ఓ అవకాశం ఇచ్చారు..ఇమిరాటీ తండ్రీ ఈసా అలీ అల్ బెలోషీ తన పుత్రరత్నం అబ్దుల్లా కోరికను వీడియో రూపంలో పోలీసులను అర్థిస్తూ ఉన్న వీడియోను గత వారం ట్విట్ చేసాడు. తనకు తానుగా తన సొంత దుబాయ్ పోలీస్ యూనిఫామ్ సైతం కల్గి ఉన్నాడని పేర్కొంటూ తన ఫోన్ నెంబర్ అందులో తెలియచేసి దుబాయ్ పోలీస్ ట్విట్టర్ ఖాతాకు ఆ తండ్రి ట్వీట్ చేశాడు. 24 గంటల తర్వాత దుబాయ్ పోలీస్ నుండి ఆ తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. మీ కుమారుని కొత్త యూనిఫామ్ కుట్టించేందుకు ..కొలతలు తీసుకొనేందుకు మా టైలర్ మీ వద్దకు వచ్చి మీ బాబు శారీరక కొలతలు తీసుకొంటారని చెప్పినపుడు ఆశ్చర్యపోయాడు జులై 27 వ తేదీన దుబాయ్ పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చినపుడు ఆ నూతన యూనిఫామ్ తీసుకోవాలని సూచించారు. దుబాయ్ పోలీస్ సోషల్ మీడియా నెట్వర్క్స్ శాఖ డైరెక్టర్ అన్నా అల్ బన్నా సమక్షంలో ఆ యూనిఫామ్ ను అందచేయనున్నారు. "మేజర్ జనరల్ అల్ మెర్రి అబ్దుల్లా కోరిక నెరవేరచనున్నాం. 8 ఏళ్ళ వయస్సు ఉన్న ఆ బాలునిలి మొదటి లెఫ్టినెంట్ పోలీస్ అధికారిగా ర్యాంక్ ఇచ్చి గౌరవిస్తున్నాం. ఈ చర్య ద్వారా సమాజంలో ఆనందాన్ని కల్గించాలని తమ వ్యూహమని పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలకు సంతోషం కలిగించే విధానమని అల్ బన్నా చెప్పారు. రాస్ అల్ ఖైమా పాఠశాలలో గ్రేడ్ 4 చదువుతున్న ఆ బాలుడు యూనిఫాంను ధరించిన తర్వాత, రాస్ అల్ ఖైమాకు తిరిగి వెళ్లడానికి ముందు అతని తండ్రి తన యూనిఫాంతో పోలీసు ప్రధాన కార్యాలయంలో నడుస్తున్నప్పుడు తన కుమారుడికి చెందిన పలు వీడియోలనుపోస్ట్ చేశాడు. ఓ వీడియో ముగింపులో "దుబాయ్ పోలీసు ధన్యవాదాలు," అబ్దుల్లా తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







