వెల్లుల్లి మేలు ఎంతెంతో!
- April 27, 2015
మనం వంటల్లో తరచుగా వెల్లుల్లిని వాడుతూనే ఉంటాం. ఇది ఆహార పదార్ధాలకు మంచి రుచిని తెచ్చిపెట్టటమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బోలెడన్ని రసాయనాలు ఉన్నాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గటానికి తొడ్పడుతున్నట్టు అధ్యయనాల్లో బయటపడింది. అయితే వెల్లుల్లి రెబ్బలను చితగ్గొట్టి, కాసేపయ్యాక పచ్చిగా తింటే మరింత ఫలితం కనబడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వేల్లుల్లిలోని రసాయనాలు మనకు ఎలాంటి లాభాలు కలగజేస్తాయో చూద్దాం.
- వేల్లుల్లిలో గంధక రసాయనాలు పెద్దమొత్తంలో ఉంటాయి. వీటికి ఒకరకమైన ఘాటు వాసనను తెచ్చిపెట్టేవి ఇవే. ఈ రసాయనాలు రక్తనాళాల్లో గార (ప్లాక్) పెరుకోకుండా కాపాడతాయి. ఇక దీనిలోని అజోఎన్ రక్తం గడ్డలు కట్టకుండా కాపాడుతుంది.
- అలిసిన్ అనేది యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్ గా పనిచేస్తుంది. ఇది పలు రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తనాళాలు ముడుచుకుపోయేలా చేసే యాంజియోటెన్సిన్ అనే ప్రోటీన్ పనితీరును ఆలిసన్ అడ్డుకుంటుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది.
- వీటిల్లోని పాలీసల్ఫైడ్స్ శరీరంలోకి వెళ్ళాక హైడ్రోజెన్ సల్ఫైడ్ వాయువుగా మారతాయి.ఇది రక్తనాళాలను సాగేలా చేసి రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతుంది.
- తరచుగా జలుబు బారినపడేవారు వెల్లుల్లిని రోజూ తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.
- మన శరీరం ఇనుమును గ్రహించుకునేలా చేయటంలో ఫెర్రొపొర్టిన్ అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది.వేల్లుల్లిలోని డయాలీల్ సల్ఫైడ్లు ఈ ఫెర్రోపొర్టిన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇనుము సంబంధ జీవక్రియలు మరింత మెరుగ్గా సాగటానికి తోడ్పడుతుంది.
- వేల్లుల్లిలోని డయాలీల్ సల్ఫైడ్, ధియోక్రేమోనోన్లు వాపు నివారకులుగా ఉపయోగపడతాయి. ఇక అలీల్ సల్ఫైడ్లు కొన్ని రకాల కాన్సుర్లు రాకుండా తోడ్పడతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







