సౌందర్య చిట్కాలు
- April 26, 2015
, by Maagulf
- కేరెట్ ని పేస్టు లా చేసి మొహానికి రాసుకుని ఒక గంట తరువాత కడిగితే, మొహం నిగ నిగ లాడుతుంది.
- కొంచం దూది తీసుకుని మరిగిన పాలలో ముంచి తీసి. మొహం పై తుడిస్తే, కంటికి కనిపిచ్చని దుమ్ము, తీసేస్తుంది, మొహం శుభ్రంగా అవుతుంది.
- చర్మం పై అక్కడక్కడా ఉన్న అనవసరమైన వెంట్రుకలను తీసేయడానికి, గుడ్డు సోన, పంచదార, మొక్క జొన్న పిండిని బాగా కలిపి మెత్తటి పేస్టుతాయారు చేయాలి. ఆ పేస్టు ను అనవసరమైన వెంట్రుకలు ఉన్న చోట రాసి ఎండిపోయాక మెల్లగా తీసేయాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేస్తే నొప్పి లేకుండా వెంట్రుకలు సురక్షితంగా తొలగిపోతాయి.
- చంక దగ్గర మరియు మెడ దగ్గర చర్మం నల్లగా ఉన్నట్లయితే, నిమ్మరసం, కీరాదోసకాయ రసం కలిపి అందులో చిటికెడు పసుపు వేసి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేస్తే నలుపు దనం పోతుంది.
- జుట్టు బాగా పెరగాలంటే తలకి పెట్టుకునే కొబ్బరి నూనె ని కసేపు మరిగించి అందులో విటిమిన్ E క్యాప్సుల్ వేసి తలకి రాసుకుంటే జుట్టు అందంగా పొదవుగా పెరుగుతుంది.
- పెదవులు నల్లగా ఉన్నవారు వాటికి నిమ్మరసం లేదా గ్లిజరిన్ రాస్తే పెదవులు ఎర్రగా తయారవుతాయి.
- టాల్కమ్ పౌడర్ ను పెదవులకు రాసుకుని లిప్ స్టిక్ వేసుకుంటే లిప్ స్టిక్ ఎక్కువ సేపు ఉంటుంది. తులసి ఆకులను నమలడం నోటినుండి వచ్చే దుర్వాసనను దూరం చేయచ్చు.