దోసకాయ మటన్‌ కర్రీ

- August 01, 2017 , by Maagulf
దోసకాయ మటన్‌ కర్రీ

కావాల్సిన పదార్థాలు
దోసకాయ - ఒకటి (సగం పండినది), టొమాటో - ఒకటి, మటన్‌ - పావుకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్‌, నూనె - రెండు టీ స్పూన్‌లు, ఉప్పు - తగినంత, కారం ఒక టీస్పూన్‌, నీళ్లు - అరకప్పు, పసుపు - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట.
ఎలా చేయాలి?
దోసకాయ పొట్టు తీసి రెండు ముక్కలుగా కట్‌ చేసుకుని విత్తనాలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.  స్టవ్‌పై బాండీ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి మరి కాసేపు వేయించాలి.  మటన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి అందులో వేయాలి. దాదాపు పది నిమిషాలు చిన్న మంటపై వేయించాలి.  ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఐదు నిమిషాల పాటు చిన్న మంటపై వేయించాలి.  టొమాటో ముక్కలు వేసి మరి కాసేపు వేయించాలి.  కారం, ఉప్పు వేసి తిప్పుతూ చిన్న మంటపై కాసేపు వేయించి అర కప్పు నీళ్లు పోయాలి. చిన్న మంటపై పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.  గ్రేవీ దగ్గర అయ్యే వరకు ఉడికించుకుని కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com