ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్న 'ఫిదా'
- August 01, 2017
మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్..హీరోగా ముకుంద సినిమాతో తెరం గ్రేటం చేశాడు.. కంచె, లోఫర్ వంటి సినిమాలతో తన సినిమా జర్నీ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పకనే చెప్పాడు.. కాగా చేసిన సినిమాలు హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుణ్.. డిఫరెంట్ నేపద్య కధలను ఎంచుకొంటున్నాడు. వరుణ్ తాజా సినిమా ఫిదా... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఇటు తెలుగు ప్రేక్షకులను, అటు ఓవర్సీస్ ప్రేక్షకులను ఫిదా చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకొని పోతున్న ఫిదా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్ లో ఫిదా ఇప్పటి వరకూ 1.62 మిలియన్ డాలర్ల కలెక్షన్ల వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్.. ఇంకా ఫిదా మూవీ క్రేజ్ తగ్గక పోవడంతో.. 2 మిలియన్లను టచ్ చెయ్యడం ఖాయం అని అంటున్నారు.. అంటే బాలయ్య 100 సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి ఓవర్సీస్ కలెక్షన్లకు షాక్ ఇవ్వడానికి ఫిదా రెడీ అవుతున్నది అని అంటున్నారు. శాతకర్ణి ఇప్పటి వరకూ ఓవర్సీస్ కలెక్షన్లలో మూడో ప్లేస్ లో ఉన్నది.. ఫిదా హవా చూస్తుంటే.. బాలయ్య రికార్డ్ ను చెరిపేసి.. పవన్ అత్తారింటికి దారేది సినిమా రికార్డ్ పై దృష్టి పెట్టేటట్లు ఉన్నది అని ట్రేడ్ వర్గాల అంచనా..!
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







