అమరావతి శిలాఫలకానికెక్కిన ప్రముఖులు వీరే
- October 21, 2015
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై 16 మంది ప్రముఖుల పేర్లను చేర్చారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం ప్రకాష్‌సింగ్ బాదల్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. వీరి తర్వాత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, సుప్రీంకోర్టు జడ్జి ఎన్‌వీ రమణ, హైకోర్టు తాత్కాలిక సీజే దిలీప్ భోసలే పేర్లు ఉన్నాయి. వీరి పేర్లతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, దత్తాత్రేయల పేర్లు ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో పాటు అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న జపాన్ మంత్రి ఇసుకే టకాచీ పేరు కూడా శంకుస్థాపన శిలాఫలకంపై చేర్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







