ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేసీఆర్ శంకుస్థాపన

- October 21, 2015 , by Maagulf
ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేసీఆర్ శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 60 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని ఆ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్ లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. గురువారం నల్గొండ జిల్లా ఎర్రవెల్లిలో 50 డబుల్ బెడ్ రూం ఇళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రేపు ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారు. అనంతరం హెలికాప్టర్ లో నల్గొండ జిల్లా సూర్యాపేట చేరుకుంటారు. అనంతరం ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com