చట్టవిరుద్ధంగా ప్రకటనలు ఇక్కడ అనుమతించబడవు

- August 03, 2017 , by Maagulf
చట్టవిరుద్ధంగా ప్రకటనలు ఇక్కడ అనుమతించబడవు

మనామ:  బహిరంగ ప్రదేశాలు  వాణిజ్య స్థలాలలో చట్టవిరుద్ధంగా ప్రకటనలు అనుమతించబడవని ఆనేక సంస్థల వాణిజ్య నమోదులను నార్త్ ఏరియా మునిసిపాలిటీ రద్దు చేసింది. అవసరమైన లైసెన్స్ పొందకుండానే ప్రత్యేకంగా కేటాయించిన స్థలాలలో వాణిజ్య ప్రకటనలను ఉపయోగించే కంపెనీలు సస్పెండ్ అయ్యాయి. ఆ తరహా నిషేధించబడిన  మునిసిపాలిటీలో చట్టపరమైన వ్యవహారాల విభాగానికి సూచించి తగిన చర్యలు తీసుకున్నామని నార్తర్ ఏరియా మున్సిపాలిటీ జనరల్ డైరెక్టర్ యూసుఫ్ అల్ ఘాతం తెలిపారు.మున్సిపాలిటీలో తనిఖీ విభాగం ఈ ఏడాది ఏప్రిల్ మరియు జూన్ మధ్యకాలంలో  అనుమతి లేని ప్రకటనలు ఏర్పాటైన సుమారు 250 ఉల్లంఘనలను గుర్తించిందని అల్ ఘాతం ధృవీకరించారు. మున్సిపాలిటీ పరిధిలో చట్టవిరుద్ధమైన ప్రకటనలను తొలగిస్తుందని  ఆ సంస్థలపై  చట్టపరమైన వ్యవహారాలకు నివేదించి  300 ధిర్హాం వరకు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు. . మేము గవర్నరేట్ లోని  వివిధ ప్రాంతాల్లో 140 పైగా ఉల్లంఘన ప్రకటనలను తొలగించాము. గత ఏడాది, ఇదే కాలంలో 811 ఉల్లంఘనలను తొలగించచినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com