ప్రారంభం కానున్న డీరట్ అల్ ఓయన్ పథకం
- August 03, 2017
మనామ: డీరట్ అల్ ఓయన్ పథకం త్వరలో ప్రారంభం కానున్నట్లు గృహనిర్మాణ మంత్రి బేసిమ్ ఆలమ్ర్ డీరత్ అల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆ అభివృద్ధి ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఆయన దయార్ అల్ ముహరక్ చైర్మన్ అబ్దుల్హకీమ్ అల్-ఖయ్యాట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ ) డాక్టర్ మహేర్ అల్ షెర్ మరియు ఇతర సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. జరిగిన అభివృద్ధి గూర్చి ఆయన క్లుప్తంగా వివరించారు. అభివృద్ధి ప్రణాళిక, మజాయ విల్లాలు మరియు సామాజిక గృహనిర్మాణ విభాగాలపై పురోగతి గురించి ఆయన వివరించారు. 1.2 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన 'డీరాట్ అల్ ఓ'ఓన్' పథకంలో 3100 విల్లాలను మాజయలో భాగంగా నిర్మించనున్నారు. సామాజిక హౌసింగ్ కార్యక్రమాలలో భాగంగా కలిగి ఉంది. రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీలో సేవా కేంద్రాలు మరియు పాఠశాలలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ బీచ్ లు , వినోద సౌకర్యాలు, మసీదులు, వైద్య సౌకర్యాలు మరియు ఒక ఆధునిక రవాణా వ్యవస్థలతో కూడిన పచ్చని ఖాళీ ప్రదేశాలు ఏర్పాటు చేయనున్నారు. మొదటి బ్యాచ్ విల్లాస్ 2018 నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







