యూఏఈ లో వేసవి తీవ్రత కారణంగా ఒక రోజులో రెండు కార్లు తగులబడ్డాయి

- August 03, 2017 , by Maagulf
యూఏఈ లో  వేసవి తీవ్రత కారణంగా ఒక రోజులో రెండు కార్లు తగులబడ్డాయి

దుబాయ్:  ఈ మండు వేసవిలో సూర్యుని నుండి నిప్పులు కురుస్తున్నాయేమో అనిపించేలా వాతావరణం మారిపోతుంది. నివాసితులు తమ కార్లను  సాధారణ నిర్వహణ పనులను నిర్వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉమ్మల్ అల్ క్విన్లోని ఒక వాహనం ఎండ ధాటికి అకస్మాత్తుగా మంటలు వెలువడి తగలబడిపోయినట్లు సివిల్ డిఫెన్స్ పేర్కొన్నారు. అల్-ఇటిహాద్ రోడ్డులో పార్కింగ్ చేసి ఉంచిన కారు నుంచి మంటలు వెలువడి తగలబడిపోతుండగా అగ్నిమాపక బృందం సంఘటన స్థలానికి చేరుకొని సమీపంలోని  దుకాణాలకు వ్యాపించకుండా సమర్ధవంతంగా నివారించి మరింత నష్టం జరగకుండా అడ్డుకోనున్నారు. ఉమ్మ్  ఆల్  క్కువైన  యొక్క పౌర రక్షణ డైరెక్టర్ కొలోన్ హాసన్ అలీ బిన్ సరామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు తమ తమ  వాహనాలను  సాధారణ నిర్వహణ పనులను చేయాలనీ వేసవి కారణంగా కారు ఇంజిన్ నుంచి మంటలు వెలువడతాయని చెప్పారు, ప్రత్యేకించి ఈ  వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ చేరుకుంటాయని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com