అగ్రరాజ్యం అమెరికా కొత్త గ్రీన్ కార్డు నిబంధనలు ఇవే

- August 04, 2017 , by Maagulf

అగ్రరాజ్యంలో అడుగుపెట్టడం మీ డ్రీమా..అమెరికాలో సెటిల్ కావాలనుకుంటున్నారా..అయితే మీకో గుడ్ న్యూస్. భారత్ వంటి దేశాలకు ప్రయోజనం కలిగేలా అమెరికా వలస విధానం మారబోతోంది. రైజ్  పేరుతో తీసుకువస్తున్న కొత్త చట్టంలో పాయింట్ల ఆధారంగా గ్రీన్ కార్డు ఇస్తారు.ఇంగ్లీష్ వస్తేనే అమెరికాలోకి అనుమతిస్తారు. ప్రస్తుతం అమెరికాలో శాశ్వత నివాసం పొందాలంటే.. లాటరీ విధానంలో గ్రీన్‌కార్డ్‌ జారీ చేస్తున్నారు. రేస్‌ చట్టం అమలైతే లాటరీ విధానం రద్దు చేసి..ఇంగ్లీష్‌ మాట్లాడే నైపుణ్యం, ఉన్నత విద్య, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ తయారు చేసి గ్రీన్‌కార్డు జారీ చేస్తారు. 

యూఎస్‌ హైస్కూల్‌లో డిప్లమా చేసే విదేశియుడికి ఒక పాయింట్ రానుంది. యూఎస్ బ్యాచులర్ డిగ్రీ అయితే  5 పాయింట్లు వస్తాయి. ఇతర దేశాల్లో మాస్టర్ డిగ్రీ చేస్తే 7 పాయింట్లు..అమెరికాలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే 8 పాయింట్లు లభించనున్నాయి. ఇతర డాక్టరేట్ హోదా వారికి 10 పాయింట్లు ఇవ్వనుండగా..యూఎస్ డాక్టరేట్ అయితే ఏకంగా 13 పాయింట్లు ఇచ్చేలా రైజ్ చట్టం రూపొందించారు. వయసుల ఆధారంగానూ పాయింట్లు కేటాయించనున్నారు. 18 నుంచి 21 ఏళ్ల మధ్య యువకులకు ఆరు పాయింట్లు, 22 నుంచి 25 ఏళ్ల వారైతే   8 పాయింట్లు వస్తాయి. 26 నుంచి 30 వయసు వారికి 10 పాయింట్లు రానున్నాయి. ఆపై ఏజే పెరిగే కొద్ది మళ్లీ పాయింట్లు తగ్గుతాయి. 31 నుంచి 35 వయసు వారికి 8 పాయింట్లు, 40 ఏళ్లు దాటిన వారికి కేవలం నాలుగు పాయింట్లే ఇస్తారు.  46 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి  రెండే పాయింట్లు దక్కనున్నాయి. 18 ఏళ్ల లోపువారికి, 50 ఏళ్ల పై బడిన వారికి పాయింట్లు ఇవ్వరు. ఇక ఇంగ్లీషులో 80 శాతం ప్రావిణ్యత ఉన్నవారికి 6 పాయింట్లు, 90 వరకు ఉంటే 8 పాయింట్లు, నూటికి నూరు శాతం ఇంగ్లీష్‌లో ఇరగదీస్తే 12 పాయింట్లు దక్కనున్నాయి.

దేశంలోకి చట్టబద్ధంగా ప్రవేశించే వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ఈ బిల్లుకు ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది.స్థానికుల ఉద్యోగులకు అవకాశాలను హరించకుండా ఇది నిరోధిస్తుంది. నైపుణ్యరహిత వలసలను తగ్గించడంతో అమెరికా ఉద్యోగుల వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. కొత్త వలస బిల్లుకు అమెరికా అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ గట్టిగా సమర్థించారు. గత 50 ఏళ్లలో ఇది గణనీయమైన వలస సంస్కరణగా  ప్రెసిడెంట్ ట్రంప్ అభివర్ణించారు.  రైజ్‌ చట్టం  పేదరికాన్ని తగ్గించి వేతనాలను పెంచుతుందన్నారు. వందలకోట్ల డాలర్ల మేర పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఆదా చేస్తుందని చెప్పారు ట్రంప్.
భారత్‌ వంటి దేశాల నుంచి వచ్చే ఉన్నత విద్యావంతులు, సాంకేతిక నిపుణులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.రైజ్ చట్టంతో భారతీయులకు గ్రీన్ కార్జుల జారీ పెరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com