ప్రభాస్ కు అనుకోని అదృష్టం

- October 21, 2015 , by Maagulf
ప్రభాస్ కు అనుకోని అదృష్టం

దసరా పండుగ ఇంకాపూర్తి కాకుండానే ప్రభాస్ కు అనుకోని అదృష్టం తలుపు తట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. 'బాహుబలి' సినిమా ఘనవిజయంతో జాతీయ స్థాయి ఇమేజ్ ని స్వంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయే అవకాశం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక వైపు 'బాహుబలి 2' అక్కడితో ఆగిపోకుండా 'బాహుబలి 3' గా కూడ కొనసాగే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రభాస్ ముందుకు రెండు హాలీవుడ్ ఆపర్లు వచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఈవార్త ఫిలిం నగర్ లో హాట్ న్యూస్ గా మారింది. మరొకశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక హాలీవుడ్ సినిమాలో ప్రభాస్ నటించడానికి ప్రాధమికంగా అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో జాకీ చాన్ కూడ కీలకపాత్రధారిగా నటిస్తున్నాడని టాక్. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ కు జాకీ చాన్ తో సమానమైన ప్రాధాన్యత ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమాను చైనా దేశానికి చెందిన ఒకప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడానికి ఇప్పటికే ప్రాధమిక చర్చలు జరుపుతోంది అని ఫిలింనగర్ టాక్. ఇది పూర్తి కాకుండానే ప్రభాస్ ను హీరోగా చేసి మరో హాలీవుడ్ సినిమా తీసే ఆలోచనలకు సంబంధించి కూడ చర్చలు జరుగుతున్నట్లు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com