రామోజీ ఫిలిం సిటీ లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు
- August 06, 2017
ఈనెల 11 నుంచి 15 వరకు 'ఫ్రీడం ఫెస్ట్'ఐదురోజుల పాటు వినోదాల కనువిందు హైదరాబాద్: పర్యాటకుల స్వర్గథామం.. వినోదాల కేంద్రం రామోజీ ఫిల్మ్‌సిటీ స్వేచ్ఛా సంబరాలకు ముస్తాబైంది. 'ఫ్రీడం ఫెస్ట్' పేరుతో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తోంది. వారాంతంలో సరదాగా గడపడమే కాదు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటే కార్యక్రమాల్లో సందర్శకులు పాలుపంచుకునేలా పలు ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి. నాసిక్ నుంచి దూల్ బీట్స్, థిమాటిక్ పాటలు, బాహుబలి ఫేం గాయనీగాయకుల పాటలతో.. ఢీ జోడీ నృత్యాలు.. మైమరిపించే ప్రదర్శనలతో వేడుకలు ఆసాంతం అతిథులను ఆనందంలో ముంచెత్తనున్నాయి.ఫ్రీడం ఫెస్ట్ రామోజీ స్టార్ ఎక్స్పీరియన్స్ (ఉ. 9గంటల నుంచి రాత్రి 7.30 వరకు).. ఏసీ కోచ్‌లో సందర్శన ఉంటుంది. ప్రదర్శన, వినోద కార్యక్రమాల్లో నేరుగా ప్రవేశం ఉంటుంది. ఎక్కువ సేపు ఎదురుచూడాల్సిన పనిలేదు.
స్వేచ్ఛా సంబరాలతో పాటూ బఫె లంచ్ ఉంటుంది. ఒళ్లు గగుర్పొడిచే రైడ్స్, స్టంట్ షోలతో పాటూ ప్రకృతి ఒడిలో గడిపిన అనుభూతినిచ్చే ఎకో టూర్ వంటి విశేషాలు ఎన్నో చూడొచ్చు. అక్కడే ఉండాలనుకునే వారికి.. రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శన అనంతరం రాత్రి అక్కడే బస చేయాలనుకునే పర్యాటకులకు వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
లగ్జరీ హోటల్ సితార, కంఫర్ట్ హోటల్ తార.. ఎకానమిలో శాంతినికేతన్లో బస చేయవచ్చు. సుందర పరిసరాలను ఆస్వాదిస్తూ.. మరుపురాని అనుభూతులను సొంతం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







