యూఏఈ లో తక్కువ ఆదాయ కుటుంబాలకు...బ్రహ్మచారులకు తక్కువ నెల అద్దెలు
- August 06, 2017
అబూదాబి : మున్సిపాలిటీ ప్రకటించిన కొత్త పథకం కింద తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు, అబుదాబిలోని బ్రహ్మచారులకు తక్కువ ధరలకు నెల అద్దెలు లభిస్తాయి. మునిసిపల్ వ్యవహారాల శాఖ మరియు రవాణా శాఖ మాట్లాడుతూ రాజధానిలో ఉన్న తక్కువ-ఆదాయం కలిగిన కుటుంబాలకు అధిక-నాణ్యతగల వసతి సదుపాయాలు అందించబడతాయి. తక్కువ జీతాలు పొందుతూ అద్దెలు చెల్లించలేక నరకయాతన అనుభవిస్తారు. ఈ నేపథ్యంలో అబుదాబి నగర మున్సిపాలిటీ అధికారులు ఓ అభినందనీయ చర్యకు శ్రీకారం చుట్టారు.తక్కువ ఆదాయం పొందుతూ.. ఎక్కువ అద్దెలు చెల్లిస్తూ ఇబ్బందులకు గురవుతున్న అబుదాబి నగర వాసులకు శుభవార్త అందింది. తక్కువ ఆదాయం పొందుతున్న కుటుంబాలు, బ్యాచిలర్స్‌కు తక్కువ అద్దెతో నివాస వసతి కల్పించనున్నామని, అందుకోసం త్వరలోనే చర్యలు తీసుకోనున్నామని అబుదాబి నగర మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. నెలకు 4 నుంచి 6 వేల దిర్హమ్ల ఆదాయాన్ని సంపాదిస్తున్న కుటుంబాలు.అధిక మొత్తాన్ని అద్దెలకే చెల్లించాల్సి వస్తోందనే విషయాన్ని గుర్తించామని, తక్కువ రేట్లకే రూంలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోనున్నామని అధికారులు తెలిపారు. తక్కువ ధరలకే ఇళ్లను అద్దెకు ఇచ్చేందుకు అనుకూలంగా ఇళ్లకు మార్పులు చేసుకోవాలని యజమానులకు సూచించామని అబుదాబి నగర మున్సిపాలిటీ జనరల్ మేనెజర్ ముసబ్ ముబారక్ తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







