యుఎఇలో మాధకద్రవ్యాల కోసం పోలీస్ 22 వెబ్సైట్లను నిషేధించిన పోలీసులు

- August 06, 2017 , by Maagulf
యుఎఇలో మాధకద్రవ్యాల కోసం పోలీస్  22 వెబ్సైట్లను నిషేధించిన పోలీసులు

దుబాయ్: టీనేజ్ యువతకు మాదకద్రవ్యాలను ప్రోత్సహించడం మరియు విక్రయాలు జరుపుతున్న నేరానికి గాను  22 వెబ్సైట్లు రాస్ అల్ ఖైమా పోలీసులు మూసివేశారు. రాస్ అల్ ఖైమా పోలీస్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కొలొనెల్ అద్నాన్ అలీ అల్ జైబి మాట్లాడుతూ, యువతకు మాదకద్రవ్యాలను ప్రోత్సహించే అనుమానాస్పద వెబ్సైట్లను పోలిసులు నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఏడాది పొడవునా అనేక మంది మాదక ద్రవ్యాల సరఫరాదారులను అరెస్టు చేయడంలో సమాచారం అందించే వారు చేసిన సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి చట్టవిరుద్ధమైన వెబ్సైట్ల చేసే నేరాలను  ఎదుర్కోవడానికి, పోలీసులు ఔషధ నియంత్రణ విభాగంలో ఒక ఎలక్ట్రానిక్ గస్తీ  బృందాన్ని ఏర్పాటు చేశారు, యూఏఈ  టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) యొక్క సమన్వయం సైతం ఎంతగానో సహాయపడింది.అనేక సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల పరిశీలనకు దారి తీసింది. "వివిధ రకాల మాదకద్రవ్యాలను  ఎలా ఉపయోగించాలో యువకులు నేర్పించిన చాలా వెబ్సైట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి , బాధితులు సులభంగా మత్తుమందులకు అలవాటుపడటం మరియు మాదకద్రవ్యాలను కొనుక్కునేందుకు పలు అడ్డదారులు తొక్కుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా మరియు ఆన్లైన్ లో మాధకద్రవ్యాల వెబ్సైట్లను పరిశీలించే యువతను జాగ్రత్తగా గమనించాలని  తల్లిదండ్రులు దుబాయ్ పోలీసులు  హెచ్చరించారు దుబాయ్లోని అనేక మంది యువకులలో మాదక ద్రవ్యాల పట్ల బానిసలుగా మారినట్లు కనుగొన్నారు. దుబాయ్ పోలీస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత ఏడాది వివిధ మాదక ద్రవ్యాల  కేసుల్లో చిక్కుకున్న వారిలో 62 శాతం మంది 15 నుంచి 25 ఏళ్ల వయస్సులో ఉన్నవారే అధికంగా ఉండటం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com